Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్, హరీశ్ రావులను అరెస్ట్ చేసిన పోలీసులు

KTR and Harish Rao arrested
Advertisement
  • కేసీఆర్‌ను కలిసేందుకు అసెంబ్లీ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు
  • మేడ్చల్ వద్ద అడ్డుకున్న పోలీసులు
  • రోడ్డుపైనే నిరసనకు దిగిన కేటీఆర్, హరీశ్ రావు
Advertisement
ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బయలుదేరిన బీఆర్‌ఎస్ కీలక నాయకత్వాన్ని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి పయనమైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేల వాహనాల కాన్వాయ్‌ను మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. వారిని అరెస్ట్ చేసి బోయిన్ పల్లి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ క్రమంలో పోలీసుల తీరుపై కేటీఆర్, హరీశ్ రావులు మండిపడ్డారు. శాంతియుతంగా వెళుతున్న తమను ఏ ప్రాతిపదికన అడ్డుకుంటున్నారని నిలదీస్తూ కేటీఆర్, హరీశ్‌ రావు రోడ్డుపైనే నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. 

ప్రతిపక్ష నేతలను నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా... ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే శాంతిభద్రతల పరిరక్షణకు విధుల్లో ఉన్నామని పోలీసులు తెలిపారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కేటీఆర్, హరీశ్‌ రావు సహా ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Advertisement
Advertisement
KTR
KCR
Congress Party Telangana
Erravelli Farmhouse
Revanth Reddy
BRS Party

More Telugu News